ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ 2023, పేపర్-II
మొత్తం 33 ప్రశ్నలు. ఏ ప్రశ్ననైనా తెరిచి మోడల్ సమాధానం చూడండి.
ఈ సమాధానం రాసి, మార్కులు పొందండి
ఏదైనా ప్రశ్నకు చేతితో సమాధానం రాసి అప్లోడ్ చేయండి; పరీక్షకుడిలా మూల్యాంకనం చేస్తాం. ప్రారంభ యాక్సెస్ కోసం వెయిట్లిస్ట్లో చేరండి.
- 1ప్రస్తుత కాలంలో హరప్పా సంస్కృతి యొక్క మనుగడ మరియు కొనసాగింపును పరిశీలించండి.10 మార్కులు · ప్రాచీన భారతదేశం - చరిత్ర పూర్వ యుగం, IVC, వేద, మౌర్యులు, కుషాణులు, శాతవాహనులు, సంగం, గుప్తులు
- 2ఫా-హియాన్ (Fa-Hien), హ్యూయెన్-త్సాంగ్ (Hiuen-Tsang) మరియు ఐ-త్సాంగ్ (I-Tsang) వంటి చైనా యాత్రికుల రచనలకు సంబంధించి తొలి భారతదేశంలోని సామాజిక-మత జీవితం మరియు పరిపాలనను పరిశీలించండి.10 మార్కులు · ప్రాచీన భారతదేశం - చరిత్ర పూర్వ యుగం, IVC, వేద, మౌర్యులు, కుషాణులు, శాతవాహనులు, సంగం, గుప్తులు
- 3ఉత్తరమేరూర్/ఉత్తరమల్లూర్ శాసనాలు సూచించినట్లుగా చోళుల గ్రామ పరిపాలన గ్రామ స్వయంప్రతిపత్తి వృద్ధికి ఏ విధంగా దోహదపడిందో పరిశీలించండి.10 మార్కులు · తొలి మధ్యయుగ & మధ్యయుగ భారతదేశం - పల్లవుల నుండి చోళుల వరకు, ఢిల్లీ సుల్తానేట్, భక్తి & సూఫీ, కాకతీయ-విజయనగర-బహమనీ-కుతుబ్షాహీ
- 4అలావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ నిబంధనలను వివరించి, వాటి ప్రభావాలను చర్చించండి.10 మార్కులు · తొలి మధ్యయుగ & మధ్యయుగ భారతదేశం - పల్లవుల నుండి చోళుల వరకు, ఢిల్లీ సుల్తానేట్, భక్తి & సూఫీ, కాకతీయ-విజయనగర-బహమనీ-కుతుబ్షాహీ
- 5మొఘల్ నిర్మాణ శైలి యొక్క లక్షణాలను చర్చించండి మరియు మొఘల్ నిర్మాణ శైలిపై హిందూ అంశాల ప్రభావాన్ని పరిశీలించండి.10 మార్కులు · మొఘలులు, మరాఠాలు & యూరోపియన్ల రాక
- 6'శివాజీ సృష్టించిన రాజ్యం భావనలో సమతావాదమే కాకుండా, స్వభావరీత్యా సంక్షేమ రాజ్యం కూడా.' పరిశీలించండి.10 మార్కులు · మొఘలులు, మరాఠాలు & యూరోపియన్ల రాక
- 7బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన భూమి శిస్తు విధానాలను వివరించండి. భారత ఆర్థిక వ్యవస్థపై ఈ శిస్తు విధానాల ప్రభావాన్ని అంచనా వేయండి.10 మార్కులు · బ్రిటిష్ పాలన 1757-1856, 1857 తిరుగుబాటు, సామాజిక-మత సంస్కరణ & జాతీయవాదం ఆవిర్భావం
- 819వ శతాబ్దంలో ముస్లిం సమాజంలో సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలను అంచనా వేయండి. ముస్లిం సమాజ అభ్యున్నతికి సయ్యద్ అహ్మద్ ఖాన్ చేసిన కృషిని చర్చించండి.10 మార్కులు · బ్రిటిష్ పాలన 1757-1856, 1857 తిరుగుబాటు, సామాజిక-మత సంస్కరణ & జాతీయవాదం ఆవిర్భావం
- 9భారతదేశంలో రైతు ఉద్యమానికి దారితీసిన కారకాలను వివరించండి మరియు భారతదేశంలో జాతీయ ఉద్యమంపై దాని ప్రభావాన్ని పరిశీలించండి.10 మార్కులు · భారత జాతీయవాదం మూడు దశలలో; స్వాతంత్ర్యం, విభజన మరియు తరువాత
- 10మతతత్వం పరోక్షంగా బ్రిటిష్ వారు భారతదేశంపై తమ నియంత్రణను శాశ్వతం చేయడానికి సహాయపడిందా? మతతత్వవాదుల సూచిక లక్షణాలను పరిశీలించండి మరియు భారతదేశ ఆధునిక చరిత్రపై వాటి ప్రభావాన్ని అంచనా వేయండి.10 మార్కులు · భారత జాతీయవాదం మూడు దశలలో; స్వాతంత్ర్యం, విభజన మరియు తరువాత
- 11శాతవాహనుల కాలంలో సామాజిక-మతపరమైన పరిస్థితులను, మహిళలకు కల్పించిన ప్రాధాన్యతను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ చర్చించండి.10 మార్కులు · ఆంధ్ర - ప్రాచీన
- 12వలసలు, కుల చలనం మరియు సామాజిక చైతన్యం వలన కలిగిన ప్రభావాలను వివరిస్తూ తూర్పు చాళుక్యుల సామాజిక-మత జీవిత పునర్నిర్మాణాన్ని వివరించండి.10 మార్కులు · ఆంధ్ర - ప్రాచీన
- 13నికోలో కాంటి, అబ్దుర్ రజాక్, డ్యుయార్టే బార్బోసా మరియు డొమింగో పేస్ వంటి విదేశీ యాత్రికుల రచనల ఆధారంగా విజయనగర సామ్రాజ్యం యొక్క సామాజిక-మతపరమైన మరియు సాంస్కృతిక జీవితాన్ని పరిశీలించండి.10 మార్కులు · ఆంధ్ర - మధ్యయుగ
- 14రెడ్డి రాజ్యాల కాలంలో సామాజిక-సాంస్కృతిక మరియు మతపరమైన పరిస్థితులను, తెలుగు సాహిత్య వికాసానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పరిశీలించండి.10 మార్కులు · ఆంధ్ర - మధ్యయుగ
- 15ఈ క్రింది ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారుల గురించి మరియు వారి సేవలను గూర్చి లఘుటీక వ్రాయండి: (iii) చార్లెస్ ఫిలిప్ బ్రౌన్10 మార్కులు · ఆంధ్ర - ఆధునిక
- 16కింది ఈస్టిండియా కంపెనీ అధికారుల గురించి మరియు వారి సేవలను గూర్చి లఘుటీక వ్రాయుము : (i) సర్ థామస్ మన్రో10 మార్కులు · ఆంధ్ర - ఆధునిక
- 17కింది ఈస్టిండియా కంపెనీ అధికారుల గురించి మరియు వారి సేవలను గూర్చి లఘుటీక వ్రాయుము : (ii) సర్ ఆర్థర్ కాటన్10 మార్కులు · ఆంధ్ర - ఆధునిక
- 18కింది వాటిపై లఘుటీక రాయండి: (i) సాహిత్యం ద్వారా సంఘ సంస్కరణకు గురజాడ అప్పారావు చేసిన కృషి.10 మార్కులు · ఆంధ్ర - ఆధునిక
- 19కింది వాటిపై లఘుటీక వ్రాయుము : (ii) వ్యవహారిక భాషా ఉద్యమాన్ని పటిష్టం చేయడంలో గిడుగు రామమూర్తి చేసిన మార్గదర్శక ప్రయత్నాలు10 మార్కులు · ఆంధ్ర - ఆధునిక
- 20తెలుగు దళిత సాహిత్యం కుల వివక్షకు వ్యతిరేకంగా, ఆత్మగౌరవం మరియు ఆత్మవిశ్వాసంతో కూడిన న్యాయమైన మరియు సమాన సమాజం కోసం ఒక సైద్ధాంతిక కథనాన్ని రూపొందించింది. ఈ సందర్భంలో, దళిత కవులు చేసిన కృషిని పరిశీలించండి.10 మార్కులు · ఆంధ్ర - జాతీయవాద ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు
- 21రంపా తిరుగుబాటు నాయకుడిగా అల్లూరి సీతారామరాజు పాత్రను పరిశీలించండి.10 మార్కులు · ఆంధ్ర - జాతీయవాద ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు
- 22నదీ యాజమాన్య బోర్డుల (River Management Boards) పనితీరును దృష్టిలో ఉంచుకొని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని పదకొండవ షెడ్యూల్లో (Schedule Eleven) పొందుపరచబడిన సూత్రాలను పరిశీలించండి.10 మార్కులు · ఆంధ్రప్రదేశ్ - విభజన మరియు దాని ప్రభావం
- 23ఆస్తులు మరియు అప్పుల పంపకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని ఏవైతే లోపాలు అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేశాయో వాటిని వివరించండి.10 మార్కులు · ఆంధ్రప్రదేశ్ - విభజన మరియు దాని ప్రభావం
- 24శీతోష్ణస్థితి నియంత్రకాలు అనగానేమి? అవి భారతదేశ శీతోష్ణస్థితిని ఎలా ప్రభావితం చేస్తాయి?10 మార్కులు · భౌతిక లక్షణాలు మరియు వనరులు
- 25ఆంధ్రప్రదేశ్లోని నల్లరేగడి మరియు ఒండ్రు నేలల లక్షణాలను వివరించండి.10 మార్కులు · భౌతిక లక్షణాలు మరియు వనరులు
- 26ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో సముద్ర ఓడరేవుల పాత్రను చర్చించండి.10 మార్కులు · ఆర్థిక భూగోళశాస్త్రం
- 27సాగర్మాల ప్రాజెక్టు (Sagarmala Project) లక్ష్యాలు మరియు ప్రధాన లక్షణాలు ఏమిటి? ఇది ఎందుకు ముఖ్యమైనది?10 మార్కులు · ఆర్థిక భూగోళశాస్త్రం
- 28గ్రామీణ స్థావరాల రకాలు మరియు వాటిని ప్రభావితం చేసే కారకాలు ఏమిటి? భారతదేశంలో గ్రామీణ స్థావరాల నమూనాలపై ఒక గమనికను జోడించండి.10 మార్కులు · సామాజిక భూగోళశాస్త్రం
- 29భారతదేశ సందర్భంలో 'జనాభా డివిడెండ్' (demographic dividend) గురించి వివరించండి.10 మార్కులు · సామాజిక భూగోళశాస్త్రం
- 30భారతదేశంలోని వివిధ అటవీ సంరక్షణ కార్యక్రమాలను చర్చించండి.10 మార్కులు · జంతుజాలం మరియు వృక్షజాల భౌగోళికం
- 31ఆంధ్రప్రదేశ్లో జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికి వివిధ స్వస్థాన (in situ) సంరక్షణ వ్యూహాలను చర్చించండి.10 మార్కులు · జంతుజాలం మరియు వృక్షజాల భౌగోళికం
- 32'కరువు'ను నిర్వచించండి. దాని వివిధ రకాలు ఏమిటి? భారతదేశంలో కరువు పీడిత ప్రాంతాలపై ఒక వ్యాఖ్యను జోడించండి.10 మార్కులు · పర్యావరణ భౌగోళికం
- 33పర్యావరణ ప్రభావ అంచనా (Environment Impact Assessment) అంటే ఏమిటి? దానిని మూల్యాంకనం చేయండి. దానిని సమర్థవంతంగా చేయడానికి సూచనలు కూడా ఇవ్వండి.10 మార్కులు · పర్యావరణ భౌగోళికం